
వంగూర్, వెలుగు: ఈనెల25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో జరగబోయే సీపీఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కమిటీ సభ్యులు బండపల్లి బాలస్వామి పిలుపునిచ్చారు. శనివారం వంగూరు మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై సీపీఎం నిరంతరం పోరాడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శివ రాములు, కేశవులు, గోపాల్, శ్రీశైలం, సత్తయ్య పాల్గొన్నారు.